- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్ఞాన్‌వాపీ మసీదుపై ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద పోస్ట్.. కార్టూన్ (వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: జ్ఞాన్‌వాపి మసీదు సముదాయానికి సంబంధించి సర్వే రిపోర్టును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఇటీవలే వారణాసి కోర్టు ఆదేశాల మేరకు బహిర్గతం చేసింది. అయితే, ఆ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞాన్‌వాపి మసీదు కింది భాగంలో అతి పెద్ద ఆలయ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. తెలుగు భాషతో పాటు మొత్తం 32 కీలక శాసనాధారాలు ఆ ప్రాంతంలో లభ్యమయ్యాయి. అదేవిధంగా 17వ శతాబ్ధంలో ఆలయాన్ని కూల్చి అదే ప్రాంతంలో మసీదును నిర్మించినట్లుగా సర్వే రిపోర్టులో వెల్లడైంది.
ఆలయ స్థంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించినట్లుగా తేలింది. ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వాఖ్యలు చేశారు. మసీదులోకి బసవన్న మసీదు గోడలు బద్దలుకొట్టి లోపలికి దూసుకొస్తున్నట్లుగా.. ‘శివయ్య’ కోసం గ్యానవాపిలో ‘బసవయ్య’ రంకె ఏశే సమయం ఆసన్నమైంది!’ అనే ట్యాగ్ లైన్‌తో ఓ కార్టూన్ పోస్ట్ చేశారు. జ్ఞాన్‌వాపి మసీదుకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొన్న వేళ ప్రస్తుతం ఆ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘శివయ్య’ కోసం గ్యానవాపిలో ‘బసవయ్య’ రంకె ఏశే సమయం ఆసన్నమైంది !!#GyanvapiMandir pic.twitter.com/VgJ74Hlrhn
— Arvind Dharmapuri (@Arvindharmapuri) January 30, 2024