- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kalvakuntla Kavitha పై కేసు నమోదు చేసేలా ఆదేశం ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన MP Dharmapuri Arvind
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కవితపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను కవిత దూషించారని, దాడులు చేశారని ఎంపీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. కాగా ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత అర్వింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఎంపీ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రాజకీయంగా సిట్యుయేషన్ మరింత హీటెక్కింది. తాజాగా కవిత విషయంలో అర్వింద్ కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఉత్కంఠగా మారింది.
Read More: సోమాజిగూడలో తీవ్ర ఉద్రిక్తత.. ధ్వంసమైన కారులోనే ప్రగతిభవన్‌కు షర్మిల