- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రులతో భేటీపై ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు రక్షణ రంగానికి చెందిన గురుకుల పాఠశాల అంశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాద్ సింగ్ ను కోరామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సహా తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. దీనిపై చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ రంగానికి సంబంధించి ఒక గురుకుల పాఠశాలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరామని, ఈ అంశాన్ని ముందస్తు ప్రాధాన్యతగా పరిగణించాలని వారిని కోరడం జరిగిందని అన్నారు.
అంతేగాక హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 2000 ఎకరాలకు పైగా రక్షణ రంగానికి చెందిన భూములు ఉన్నాయని, వాటిని తెలంగాణ అభివృద్ధి కోసం కేటాయించాలని రక్షణ శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశానికి సంబంధించి, తెలంగాణలో హైదరాబాద్ కాకుండా వరంగల్, కరీంనగర్ అనే మరో రెండు జంట నగరాలు స్మార్ట్ సిటీలుగా ఉన్నాయని, గత ప్రభుత్వం వాటి అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని, ఇప్పడు వాటి వేగవంతమైన అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరినట్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.