కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌పైరీ డేట్ ఓవర్.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు

by Disha Web Desk 19 |
కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌పైరీ డేట్ ఓవర్.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలు ఆలస్యానికి కారణమేంటో కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని, ఆ పార్టీ ఇప్పటి వరకు చేసిన అవినీతి, అక్రమాలు చాలు అని ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమ సంపాదనతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఇక, ప్రధాని మోడీ తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, ఇక్కడి డబ్బులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ డబ్బులు ఢిల్లీ లిక్కర్ పాలసీలో పెట్టుబడి పెడుతున్నారని అన్నారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదు కాబట్టే లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ, బొరుసుగా ఉన్నాయని, ఆ రెండు పార్టీలు అవినీతికి పాల్పడకపోతే సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఆస్తులు, అక్రమ సంపాదనపై చర్చకు తాను సిద్ధమని.. మీరు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Next Story

Most Viewed