- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌పై భారీ కుట్ర.. ఆ ముగ్గురు ప్లాన్.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో ప్రస్తుతం 1980 తరువాత నాటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయని, సీఎం కేసీఆర్‌ను పదవి నుంచి దించే ప్రక్రియ జరుగుతోందని నిజామబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రికోణ వ్యూహంగా మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రావు లు ఆ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు అనుగుణంగానే ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెరుగుదల, ఆర్టీసీ బస్ చార్జీల పెంపుదల అని అన్నారు. ప్రతినిత్యం సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంను మీడియా ముఖంగా విమర్శలు, ఆరోపణలు చేసే ఎంపీ అర్వింద్ ఏకంగా సీఎం కేసీఆర్ పై కుట్ర జరుగుతున్నట్లు మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. 1983లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను, నాదెండ్ల భాస్కర్ రావును, తరువాత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిలను సీఎం పదవిలో నుంచి దించేందుకు అల్లర్లకు, మత కల్లోలాలకు అప్పటి అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. అదే మాదిరిగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను గద్దె దించే ప్రక్రియ జరుగుతుందన్నారు.
కేటీఆర్‌ను సీఎం చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న కేసీఆర్ ప్లాన్ ఉత్తరాదిలో బీజేపీ ఫలితాలతో మార్చుకున్నారన్నారు. ఆ దెబ్బతోనే మంత్రి కేటీఆర్ అలిగి అమెరికా వెళ్లారని అర్వింద్ ఆరోపించారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను జైలుకు వెళ్లకుండా ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవితనే తనకు ప్రతిపక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.