MP Aravind: పసుపు రైతుల కల నెరవేరింది.. ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు

by Shiva |
MP Aravind: పసుపు రైతుల కల నెరవేరింది.. ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) పండుగ సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కానుకనిచ్చారు. ఈ మేరకు జిల్లాలో పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నిజామాబాద్ (Nizamabad) కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) కార్యాలయం ప్రారంభం కానుంది. బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి (Palle Ganga Reddy)ని నియమిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్‌ (Nizamabad)లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind), ప్రధాన నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. పసుపు ప్రాసెసింగ్ (Turmeric Processing), మార్కెటింగ్ (Marketing) విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉటుందని అన్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story