CM Revanth Reddy's : మూసీ పరివాహకంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

by Y. Venkata Narasimha Reddy |
CM Revanth Reddys : మూసీ పరివాహకంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy's) యాదాద్రి జిల్లా పరిధిలో మూసీ నది(Musi area) ప్రాంతాల్లో పర్యటించనున్న నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించిన సభా వేదిక ఏర్పాటు స్థలాన్ని వారు పరిశీలించారు. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసీ కాజ్ వే వద్ద మూసీ పరివాహక రైతులతో సమావేశం కానున్నారు.

మూసీ పునరుజ్జీవనంపై రైతులతో మాట్లాడనున్నారు. మూసీ నది పరివాహక గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి రైతులతో సమావేశం కానున్నారు. కాగా సీఎం మూసీ ప్రాంత పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హన్మంత రావు, డీసీపీ రాజేష్ చంద్రలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story