కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్.. అర్హుల గుర్తింపు ప్రాసెస్ స్టార్ట్..!

by Satheesh |
కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్.. అర్హుల గుర్తింపు ప్రాసెస్ స్టార్ట్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుండి కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య దరఖాస్తులను స్వీకరించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలనలో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. వీటితో పాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ తీసుకున్నారు.

అయితే ఆరు గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం వెంటనే వీటిపై చర్యలు మొదలుపెట్టింది. దాదాపు 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రజాపాలనలోనే కాకుండా ప్రజావాణిలోనూ రేషన్ కార్డులు, పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో కొత్త రేషన్ కార్డుల మంజూరు అయ్యే అవకాశం వుందని సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రుణమాఫీ స్కీమ్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన సర్కార్ త్వరలోనే రేషన్ కార్డుల మంజూరుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, క్షేత్ర స్థాయిలో ఇప్పటికే అధికారులు పెండింగ్ దరఖాస్తులను స్క్రూటినీ చేయడం ప్రారంభించారు. అందులో అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. మొత్తానికి తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు మోక్షం కలగనుంది.

Advertisement

Next Story

Most Viewed