- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పురుగుల మందుతో మోత్కుపల్లి నర్సింహులు హల్‌చల్.. చనిపోతానంటూ సంచలనం
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ట్యాంక్‌బండ్ వద్ద హల్‌చల్ చేశారు. పురుగుల మందుతో ఆయన కనిపించడం కలకలం రేగింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను ఆయన సందర్శించారు. ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు అమలు కాకపోతే గడ్డి మందు తాగి చనిపోతానంటూ గతంలో తాను చెప్పానని, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో చాలామంది దళిత యువకులు తనకు మెసేజ్‌లు పెడుతున్నారని అన్నారు. అందుకే గడ్డి మందు తీసుకొచ్చానని, కేసీఆర్ ముహూర్తం పెడితే తాగి చనిపోతానంటూ కామెంట్ చేయడం సంచలనం రేపుతోంది.
ఇటీవల రాజకీయాల్లో మోత్కుపల్లి మళ్లీ యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్‌లో సైలెంట్‌గా ఉన్న ఆయన.. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేయడంతో పాటు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ కావడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. తుంగతుర్తి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం నడించింది. ఆ తర్వాత సైలెంట్‌గా ఉన్న మోత్కుపల్లి.. తాజాగా మళ్లీ వాయిస్ పెంచారు.
శనివారం జగన్‌పై మరోసారి దుమ్మెత్తిపోశారు. జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే జగన్‌దే బాధ్యత అని, చంద్రబాబు అవినీతికి పాల్పడే నేత కాదని అన్నారు. జగన్.. అసలు నీకు సిగ్గుందా..? చంద్రబాబు లాంటి నేతను ఎన్నికలకు ముందు జైల్లో పెట్టిస్తావా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల జీహెచ్‌ఎంసీ ఏరియాలో బీఆర్ఎస్ నష్టపోతుందని, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.