వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అదే.. తేల్చి చెప్పిన తెలంగాణ మాజీ మంత్రి

by Satheesh |   ( Updated:2024-06-07 15:52:42.0  )
వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అదే.. తేల్చి చెప్పిన తెలంగాణ మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రితీలో ఘన విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 153 స్థానాలను కైవవం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్ నేతృత్వంలోని వైసీపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. 153 స్థానాల నుండి కేవలం 11 సీట్లకు పరిమితమై అధికారాన్ని పోగొట్టుకుంది. ఎవరూ కూడా ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో జగన్ నేతృత్వంలోని వైసీపీపై ఓటమిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి జగన్ అహంకారమే కారణమని తేల్చి చెప్పారు.

ఆయన అహంకారపూరిత స్వభావంతోనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయన ఐదేళ్ల పాలనలో ఏపీని మరింత అభివృద్ధి చేసి.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మోత్కపల్లి మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని మొదటి చెప్పింది తానేనని.. కానే ఆయన మా సామాజికి వర్గాన్ని ఫస్ట్ రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆయనను కలిసేందుకు కూడా రేవంత్ రెడ్డి అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని.. తాను ఆరు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని.. కానీ నా రాజకీయ జీవితంలో ఇంత ఘోర అవమానం ఎప్పుడు జరగలేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed