- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ 3 పార్టీలు కలిసి చంద్రబాబును చంపే కుట్ర: మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు పార్టీలు కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జైల్లో హింసించి బాధ పెడుతున్నారని.. బాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని ప్లాన్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు ఏమైనా అయితే, సీఎంలు జగన్, కేసీఆర్, బీజేపీదే బాధ్యత అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
జైలు నుండి చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ మళ్లీ డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. చంద్రబాబు కుటుంబానికి రక్షణ లేదని.. ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా లేకుండా చేశారని వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. కాగా, గతంలో కూడా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మోత్కుపల్లి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక్క రోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.