BSPకి ఆర్థిక సాయం చేసిన RS ప్రవీణ్ కుమార్ తల్లి

by GSrikanth |   ( Updated:2022-08-11 07:08:16.0  )
BSPకి ఆర్థిక సాయం చేసిన RS ప్రవీణ్ కుమార్ తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బహుజన సమాజ్ పార్టీలో చేరి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీలో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన తల్లి పార్టీ అభివృద్ధికి ఆర్థిక సాయం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''నేను బీఎస్పీలో చేరి ఒక సంవత్సరమైన సందర్భంగా, మా అమ్మ పొదుపు చేసుకున్న తన పెన్షన్ నుండి బహుజన రాజ్యాధికార నిధికి రూ.50,000 విరాళంగా ఇచ్చింది.'' అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం

Advertisement

Next Story