- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Moosi: మూసీ ప్రక్షాళకు ఎన్నారైల మద్దతు.. తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీసుకున్న మూసీ ప్రక్షాళన(Moosi Purge) నిర్ణయానికి ఎన్నారైలు(NRIs) మద్దతు(Support) తెలుపుతున్నారని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ట్వీట్ చేసింది.ఈ సందర్భంగా ఓ ఎన్నారై మూసీ ప్రక్షాళనపై మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇందులో ఆస్ట్రేలియా(Australia), మెల్‌బోర్న్(Melbourne) కు చెందిన పుల్లారెడ్డి(Pullareddy) అనే ఎన్నారై మాట్లాడుతూ.. తమది మూసీ పరివాహక ప్రాంతమైన వలిగొండ మండలం అని చెప్పారు. అలాగే 25 ఏళ్ల క్రితం మూసీ నది చెలిమెలలో నీళ్లు తాగేవారని, కానీ ఇప్పుడు కాలుష్య వ్యర్థాలతో మూసీ ప్రాంత ప్రజలు రోగాల భారీన పడటం, పశుపక్షాదులు మృతి చెందడం, పంటలు నాశనం అవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నారైలు అందరూ స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మూసి పరివాహక ప్రాంత రైతులు, చేతివృత్తుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసి పునర్జీవ కార్యక్రమానికి ఎన్నారైలు మద్దతు తెలుపుతున్నారని రాసుకొచ్చింది.