బంగారం తాకట్టు పెట్టి లోను.. మూత్ర విసర్జన చేసి వచ్చి చూసేలోగా..

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-03 06:00:40.0  )
బంగారం తాకట్టు పెట్టి లోను.. మూత్ర విసర్జన చేసి వచ్చి చూసేలోగా..
X

దిశ మక్తల్: మూత్ర విసర్జన చేసి వచ్చేలోగా డబ్బులు మాయమయ్యాయి. బంగారం తాకట్టు పెట్టి లోను తీసుకొని బైకు డిక్కీలో రెండున్నర లక్షలు ఉంచి మూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చే లోపు మోటార్ సైకిల్ ఉంచిన రూ. రెండున్నర లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ ఘటన మక్తల్ పట్టణంలో ఎస్‌బీఐ బ్యాంకు దగ్గర చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితుడు శంకరప్ప స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మండలంలోని మాధ్వారం గ్రామానికి చెందిన శంకరప్ప ఖరీఫ్ వంట సాగు నిమిత్తం గురువారం రోజు భార్య ఒంటిపై ఉన్నఎడున్నర తులాల బంగారం నగలను మక్తల్ పట్టణం సంగంబండరోడ్డులో ఉన్న ఎస్‌బీఐ వ్యవసాయ బ్యాంకు బ్రాంచులో గురువారం తాకట్టుపెట్టాడు.

మరునాడు డబ్బులు తీసుకోమని మేనేజర్ చెప్పడంతో ఈరోజు మధ్యాహ్నం శంకరప్ప బ్యాంకు నుండి రూ.రెండున్నర లక్షలు డ్రా చేసుకొని ఓ కవర్లో ప్యాక్ చేసుకున్నాడు. మోటారు బైక్ డిక్కీ‌లో ఆ కవర్ ఉంచి బ్యాంకు ముందు బైకు ఆపి మూత్ర విసర్జనకు వెళ్లోచ్చాడు. అయితే డిక్కీలో చూడగా నగదు కవరు కనిపించలేదు. దీంతో బాధితుడు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఘటన‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను ట్రేస్ చేస్తే దొంగ ఎవరన్నది తెలుస్తుందని ప్రజలు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed