- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనీలాండరింగ్ కేసు : రెండోరోజు ఈడీ విచారణకు సుఖేష్ గుప్తా
దిశ, డైనమిక్ బ్యూరో : ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ సుఖేశ్ గుప్తా రెండోరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎంఎంటీసీ సంస్థను మోసం చేశారనే కేసులో సుఖేశ్ గుప్తాపై మనీలాండరింగ్ కేసు నమోదు కాగా.. ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఇటీవలే హైకోర్టు సుఖేశ్ గుప్తాకు సూచించడంతో బుధవారం హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన.. నేడు మరోసారి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.
బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్స్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)తో ఎంఓయూ కుదుర్చుకున్న లావాదేవీలపై ఈడీ అధికారులు సుఖేశ్ గుప్తాను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అలాగే సుఖేశ్ గుప్తా బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు తనిఖీ చేసినట్టుగా సమాచారం.
కాగా, బంగారు వ్యాపారులకు మినరల్స్, మెటర్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) రాయితీపై అరువుగా ఇచ్చే బంగారం సౌకర్యాన్ని ఉపయోగించుకుని సుఖేశ్ గుప్తా డైరెక్టర్‌గా ఉన్న ఎంబీఎస్ జ్యువెల్లర్స్ భారీగా బంగారాన్ని అరువుగా తీసుకున్నారు.
దీంతో ఎంబీఎస్ జ్యువెలర్స్ యాజమాన్యం ఎంఎంటీసీని దాదాపు రూ. 500 కోట్ల మేర మోసం చేసిందని ప్రాథమిక విచారణలో ఈడీ గుర్తించింది. ఇందులో ఎంఎంటీసీ ఉద్యోగుల సహకారం కూడా ఉందని ఆరోపించింది. అయితే ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ఎంఎంటీసీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఎంఎంటీసీకి చెందిన కొంత మంది అధికారుల అండదండలతోనే సుఖేశ్ గుప్తా మోసానికి పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగప్రవేశం చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో ఎంబీఎస్ షోరూమ్‌లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. పలు ఆస్తులను కూడా అటాచ్ చేశారు.