- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024 లోనూ మళ్లీ మోడీయే ప్రధాని: MP లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: 2024 ఎన్నికల్లో మరోసారి దేశ ప్రజలు మోడీ నేతృత్వంలో సర్కార్‌ను ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.ఆదివారం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా గుహవటిలో బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుటుంబ, కుల పార్టీలను దేశ ప్రజలు తిరస్కరిస్తారని లక్ష్మణ్ అభివర్ణించారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తే.. మోడీ సర్కార్ మాత్రం అష్టలక్ష్మి రాష్ట్రాల్లుగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్రవాదాన్ని, వెనకబాటు తనాన్ని తొలగించి అభివృద్ధిని ప్రధాని మోడీ కొత్త పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. అందుకే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని చెప్పారు.
అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ ఏలినంతకాలం మాఫియా, గూండాయిజం రాజ్యమేలితే హిమంత బిశ్వ శర్మ వచ్చాక దేశభక్తి, అభివృద్ధి ప్రస్ఫుటం అవుతున్నాయన్నారు. ఇలాంటి నిరాడంబర సీఎంలు కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమవుతోందని.. దేశంలో అతి పెద్ద రాష్ట్రాన్ని ఏలుతున్న యోగి ఆదిత్యనాథ్ సోదరి ఒక చిన్న పచారి కొట్టు నడిపించుకుంటోందన్నారు.
దేశంలోని ప్రజలంతా తన కుటుంబంగా భావించి మోడీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో దూసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్థికంగా చితికిపోయి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతే మోడీ ముందు చూపుతో, పట్టుదలతో అవినీతి రహిత పారదర్శక పాలన వల్ల భారతదేశం ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా మారుతోందని డా.లక్ష్మణ్ అన్నారు. మోడీ, బీజేపీ వల్ల మాత్రమే దేశంలో వెనుకబడిన తరగతులకు అభివృద్ధి ఫలాలు, రాజకీయ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల మోడీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు.