- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Addanki Dayakar :మోడీ రాముడు కాదు.. రాజకీయం కోసం హిందువుగా మారిండు: అద్దంకి దయాకర్ సంచలన వీడియో
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ రాముడు కాదు.. మోడీ లాంటి కోట్ల మందికి శ్రీ రాముడు దేవుడని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సంచలన వీడియో విడుదల చేశారు. మోడీ రాముడు కాదని, మోడీ లాంటి కోట్ల మందికి శ్రీ రాముడు దేవుడని మాట్లాడారు.
‘వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా మా తండ్రి పేరు రామ లక్ష్మయ్య, నా పిల్లల పేర్లు కూడా.. నా మొదటి బిడ్డ పేరు ఆత్మజ రామ్, రెండో బిడ్డ పేరు ముక్త శ్రీ, కొడుకు పేరు జానకి రామ్ వినయ్. నా కుటుంబంలోనే రాముడు ఉన్నాడు. వీడెక్కడి నుంచి మధ్యలో హిందూ అనే పేరు మీద రాజకీయం చేసుకోవడానికి హిందువుగా మారిండు. నేను ఇంకా స్పష్టంగా చెబుతున్న మీకేం పేటెంట్ రైట్స్ ఇవ్వలేదు. ఒక పదివేల సంవత్సరాల తర్వాత బీజేపీ పుట్టును, దానికి హిందుత్వం అనేది పేటెంట్ హక్కు రాసి ఇవ్వబడును. మిగతా వాళ్లు ఎవరూ కూడా హిందువుగా చెప్పుకోవద్దు, బీజేపీలో ఉంటేనే హిందువు, నేను అంటున్న ఈ రోజు ఈ దేశంలో ఉన్నవాళ్లందరూ హిందువులు అని మీ ఆర్ఎస్ఎస్ ఆయనే అన్నాడు. మరి మీకెందుకు ఈ వివక్ష, ఎస్సీ, ముస్లీం, క్రిస్టియన్ అంటే పడదు, మీకు మీరంటే కూడా పడ్తాదా అంటే మీకు మీరు కూడా కోట్లాడ్తరు. ఆ యోగి ఆధిత్యనాధ్‌ని ఓడగొట్టింది అమిత్ షానే అంటా? ఎందుకంటే మళ్లీ గెలిస్తే ప్రధాన మంత్రి పోటీకి వస్తాడు అని’ అని అద్దంకి తీవ్ర విమర్శలు చేశారు.