- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం.. కేటీఆర్‌తో ఎమ్మెల్సీ మల్లన్న భేటీ

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana budget meetings) ఈ రోజు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Mallanna), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) తో అసెంబ్లీలోని ఎల్పీ (LP in assembly)లో భేటీ అయ్యారు. కాగా ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు అసెంబ్లీలో బీసీ బిల్లు (BC Bill) ను ప్రవేశపెట్టిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని నిలదీయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్లన్న (MLC Mallanna), కేటీఆర్ (KTR) ను కోరారు. అలాగే.. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేధికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని కోరారు.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముందు మల్లన్న.. ఓ వర్గం నేతలపై తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా.. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేస్తూ.. వారి హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేస్తూ.. వారి హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే కులగణన నివేదికలను తన యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో కాల్చివేశారు. అలాగే బీసీ లందరూ.. కులగణన పత్రాలను తగలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.