- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోపం తగ్గించుకోండి.. మంచి రోజులు వస్తున్నాయ్: MLC
దిశ, తెలంగాణ బ్యూరో: క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కార్యకర్తలంతా పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతీ కార్యకర్త అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు రాబట్టాలని, తద్వారా కేంద్రంలోనూ పవర్‌లోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని, కార్యకర్తలంతా అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో అందరికీ మేలు జరుగుతుందన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగుతుందన్నారు.
వంద రోజులలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు. గత ఉగాది వేడుకల్లో కాంగ్రెస్ గెలుస్తుందని పంతులు చెప్పినట్లే జరిగిందన్నారు. అప్పుడు కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేసినా, గెలిచిన తర్వాత పరిస్థితులు అందరికీ అర్ధమయ్యాయన్నారు. ఈసారి కూడా పార్టీకి మంచి జరుగుతుందన్నారు. స్వల్ప పాటి విపత్తులు ఉన్నప్పటికీ, సమర్ధవంతంగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 నుండి 15 సీట్లులో గెలుస్తుందన్నారు. కేంద్రంలో రాహుల్ పీఎం అయ్యేందుకు ఈ సీట్లు కీలకంగా మారతాయన్నారు.