వాళ్లంతా కేసీఆర్‌‌ను వెతికే పనిలో ఉన్నారు.. ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-03 15:16:50.0  )
వాళ్లంతా కేసీఆర్‌‌ను వెతికే పనిలో ఉన్నారు.. ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతోందని.. ఇలాంటి కష్ట కాలంలో బాధ్యతగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు భరోసా ఇస్తూ.. సర్కారుకు సలహాలు సూచనలు ఇవ్వాలని కేసీఆర్‌కు సూచించారు. కానీ ఫామ్ హౌస్‌కే పరిమితం కావడం దారుణమన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి సాయం చెయ్యాల్సిన సోయి లేదా? ప్రశ్నించారు. కేసీఆర్ ఏ ఫామ్ హౌస్‌లో ఉన్నాడో వెతికే పనిలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. మొన్నటి వరకు కవిత బెయిల్ కోసం పనిచేసిన కేటీఆర్.. ఇప్పుడు హాయిగా ఇంగ్లాండ్‌లో రిలాక్స్ అవుతున్నారని విమర్శించారు. రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఇంగ్లాండ్‌లో విహార యాత్రలు ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యత మరిచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులను ఆదుకోడానికి రోడ్డు మార్గంలో వెళ్లి పర్యటిస్తున్నారు. నాలుగైదు రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉన్నారని చెప్పారు. కేటీఆర్‌కు హెలికాప్టర్‌ల సోకులు తప్పా మరేం లేదని అన్నారు. ‘పసలేని ట్వీట్లు పెడ్తూ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ముందు వరద సాయం చేస్తానని చెప్పి అన్ని ఎగొట్టాడు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా కట్టకుండా రైతులను మోసం చేసిన మొనగాడు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో రాజ్ భవన్ ముందున్న ఎంఎస్ ముక్తా నీటమునిగిన కేసీఆర్ గడపదాటి బయటికి రాలేదు. కేంద్రంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆర్థికసాయం కోరారు. కొన్ని పేపర్లో అడ్డగోలుగా వార్తలు రాస్తున్నారు. వాస్తవాలకు దూరంగా వార్తలు వస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్ష నేతగా జగన్మోహాన్ రెడ్డి సమర్దవంతమైన పాత్ర పోషిస్తున్నారు. బాధ్యతల ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజలకు అండగా నిలబడ్డారు. ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితంఅయ్యారు. ఇంత విపత్తు వచ్చిన కేసీఆర్, కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు. సంపాదించుకున్న సొమ్ముని దాచుకునే పనిలో బీఆర్ఎస్ నేతలున్నారు. సర్కార్‌కు సపోర్ట్ చేయాలి’ అని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed