MLC Kavitha: మరోసారి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

by Mahesh |
MLC Kavitha: మరోసారి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితా తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఢిల్లీ మధ్య విధానం, సీబీఐ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో కవిత పై సీబీఐ వేసిన ఛార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జులై 26న కవితను వర్చువల్ గా కోర్టులో హాజరు పరచాలి అని సీబీఐకి కోర్టు ఆదేశించింది. అలాగే ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరపున లాయర్లకు ఇవ్వాలని తెలిపింది. కాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్ విచారణను కోర్టు ఆగస్టు 5కు వాయిదా వేసింది. దీంతో ఎమ్మెల్సీ కవితకు మరోసారి కోర్టులో షాక్ తగలగా.. ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలో ఆమె మార్చి 16న అరెస్ట్ అయింది.

Advertisement

Next Story