- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్.. ఒకే రోజు ఆ మూడు జిల్లాల్లో.. కవిత ఆవేదన

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్లలో వరుసగా చోటు చేసుకున్న (food poisoning) ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా గురువారం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కేవలం ఒకే ఒక్క రోజులో మూడు జిల్లాల్లో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధ్యతారహిత ప్రభుత్వం మేల్కొనే ముందు ఇంకా ఎంత మంది అమాయక పిల్లలు బాధపడాలి? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పూర్తిగా పొలిటికల్ డ్రామాలో మునిగి తేలుతున్నారని, తెలంగాణ భవిష్యత్ అయినటువంటి పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రతి బిడ్డకు సురక్షితమైన, పోషకమైన ఆహారం పొందే హక్కు ఉందన్నారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో విద్యార్థులను పట్టించుకోవడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత దాదాపు 22 మంది అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో కొందరు కోలుకున్నారు. కొంత మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.