హైదరాబాద్‌కు బయల్దేరిన కవిత, కేటీఆర్, హరీశ్ రావు!

by GSrikanth |   ( Updated:2023-03-16 10:15:22.0  )
హైదరాబాద్‌కు బయల్దేరిన కవిత, కేటీఆర్, హరీశ్ రావు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ మరోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. గురువారం ఉదయం నుంచి కవిత విచారణకు హాజరు విషయంలో హైడ్రామా నెలకొంది. ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఇవాళ తాను విచారణకు హాజరుకాలేనని అధికారులకు కవిత సమాచారం ఇవ్వడంతో మార్చి 20న విచారణకు రావాలని మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణకు సమయం ఉండటంతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు కవిత సైతం హైదరాబాద్‌కు బయలుదేరారు.

కాగా, ఇవాళ కవిత గైర్హాజరు కావడంతో ఈ కేసులో కన్ ఫ్రంటేషన్‌లో విచారణ చేయాలని భావించిన ఈడీకి ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ కేసులో బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రపిళ్లైతో పాటు కవిత ఈ ముగ్గురిని ఈడీ ప్రశ్నించాలని భావించింది. కానీ చివరి నిమిషంలో కవిత తాను విచారణకు హాజరు కాకుండా తన ప్రతినిధి ద్వారా అవసరమైన డాక్యుమెంట్లను పంపి ట్విస్ట్ ఇచ్చింది. అయితే కవితకు మద్దతుగా మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 11న తొలిసారి కవితను ఈడీ విచారణకు పిలిచి సమయంలోనూ పెద్ద ఎత్తున మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. విచారణ ముగియగానే తిరిగి రాష్ట్రానికి వచ్చేశారు. ఈ సారి కూడా కవిత కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్లిరావడం చర్చగా మారుతోంది.

Read more:

బిగ్ బ్రేకింగ్ : కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

Advertisement

Next Story