- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: బీఆర్ఎస్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా కూతురు కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పష్టం చేశారు. భారత జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ కవిత వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళలకు మా పార్టీతో సహా ఎవరూ ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. కానీ కొన్ని పార్టీలు మహిళలకు అవకాశం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మా పోరాటం ఆగదని కవిత ఈ సందర్భంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతానని తెలిపారు. గురువారం ఈడీ విచారణకు హాజరు కావడానికి ముందే మీడియాతో మాట్లాడుతానని ఆమె చెప్పారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ నెల 11వ తేదీన దాదాపు 9 గంటలపాటు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. ఇక, బీఆర్ఎస్‌లో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదని దేశ రాజధాని సాక్షిగా కవిత వ్యాఖ్యానించడం బీఆర్ఎస్‌తో పాటు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా ఉన్న ఈ కామెంట్స్.. ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ జోరుగా ప్రచారం జరుగుతోంది.