- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ లాగే కోహ్లీ.. విరాట్‌పై MLC కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇవాళ న్యూజిలాండ్‌పై సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. వన్డే ఫార్మాట్లో (50) సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా సచిన్ (49) సెంచరీల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో 50 సెంచరీల మైలురాయి అందుకున్న ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకుని.. సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కోహ్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సైతం ఎక్స్‌లో (ట్విట్టర్) శుభాకాంక్షలు తెలిపారు.
‘‘సీఎం కేసీఆర్ వలే విరాట్ కోహ్లీకి ఎదురులేదు. మాస్టర్లు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి’’ అని ట్వీట్ చేశారు. ‘క్రికెట్‌లో కోహ్లీకి తిరుగులేదు.. తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురులేదు’ అని కోహ్లీ, కేసీఆర్ ఫొటోలతో ఉన్న ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. ‘‘విరాట్ కోహ్లి బౌండరీలే కాదు రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ రోజు ముంబై నడిబొడ్డున ఆయన గొప్పతనం కనిపించింది. వన్డేల్లో 50 సెంచరీల మైల్ స్టోన్‌ను కీలకమైన వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అందుకోవడం ప్రతి భారతీయుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు జ్ఞాపకార్థం. కోహ్లీని చూసి గర్వంగా ఉంది’’ అని కవిత మరో ట్వీట్ చేశారు.