- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భర్తకు హగ్ ఇచ్చిన కవిత.. ఈడీ విచారణకు ముందు ఆసక్తికర సీన్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరవుతోన్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈడీ ఆదేశాల మేరకు సోమవారం విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుండి బయలుదేరిన కవిత.. ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కవితకు మద్దతుగా వెంట ఆమె భర్త అనిల్, న్యాయవాది భరత్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర బీఆర్ఎస్ నేతలు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
అనంతరం కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తున్న సమయంలో అక్కడ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విచారణ ఎదుర్కొనేందుకు ఆఫీస్‌లోకి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్‌ను హగ్ చేసుకున్నారు. అనంతరం అనిల్ భార్యకు ధైర్యం చెప్పి భుజం తట్టి లోపలికి పంపించారు. ఇక, నివాసం నుండి బయలుదేరేముందు కూడా పార్టీ నాయకులను పలకరిస్తూ చిరు నవ్వుతో కవిత విచారణకు వెళ్లారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ధైర్యంగా కవిత విచారణకు హాజరయ్యారు. కాగా.. టెన్షన్ వాతావరణంలోను కవిత భర్తకు హగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ఈడీ ఆఫీసులో కవితకు ఫేసింగ్ బయోగ్రఫీ వెరిఫికేషన్ (వీడియో)