- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రి నుండి MLC కవిత డిశ్చార్జ్.. కేసీఆర్ కూతురికి అసలు ఏమైందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురి అయ్యారు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న ఆమె ఇవాళ నీరసంతో కళ్లు తిరిగిపడిపోవడంతో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రిలో వైద్యులు కవితకు చికిత్స అందించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం కుదుటపడటంతో డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశారు. దీంతో అధికారులు ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కవిత క్షేమంగా ఉన్నారని తెలియడంతో గులాబీ కార్యకర్తలు ఊపీరి పీల్చుకున్నారు.
కాగా, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం పలుమార్లు కోర్టును ఆశ్రయించగా ఆమెకు నిరాశే ఎదురైంది. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. దీంతో ఇక బెయిల్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.