- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు కవిత కేసు విచారణ.. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ చార్జిషీట్..
దిశ, డైనమిక్ బ్యూరో: నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ఛార్జిషీటు వేసిన సంగతి తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేసు విచారణ రానుంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ ఏప్రిల్ 11 వ తేదీన అరెస్టు చేసింది.
అయితే, లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ చార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత ప్రమేయంపై విచారణ నేడు జరగనుంది. కాగా, కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరుతున్నా.. కోర్టు మాత్రం బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ వస్తుంది.