కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. MLC జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-24 10:27:25.0  )
కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. MLC జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తనకు సమాచారం లేకుండా సంజయ్‌ను చేర్చుకోవడంపై గుస్సా మీద ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో చర్చించారు.

అయితే విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి నచ్చజప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి 40 ఏళ్లుగా పాలిటిక్స్ చేశానని.. పార్టీకి రిజైన్ చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికపై సైతం జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోచారం కాంగ్రెస్ లో చేరడం అవకాశవాద రాజకీయానికి నిదర్శనమన్నారు. కాగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పొలిటికల్ స్టెప్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story