- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క నిర్ణయంతో రూ.40 వేల కోట్లు భారం.. కేసీఆర్‌పై MLC జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు చేయాలన్న కేసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖపై రూ.40 వేల కోట్ల భారం పడిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని.. దీనికి గత ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ కక్కుర్తిపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌర, పవన విద్యుత్‌కు బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లపై పవర్ కమిషన్ జరుపుతోన్న విచారణను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు.
Advertisement
Next Story