- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Jeevan Reddy: నీ పోరాటానికి పీసీసీ పదవే అడ్డు వచ్చిందా? రాజగోపాల్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: MLC Jeevan Reddy Criticizes Komatireddy Rajagopal Reddy| మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అతని చేతగాని తనమేనని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంపై సోమవారం స్పందించిన ఆయన.. ఇక రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టడని అన్నారు. ప్రజల తరపున పోరాడేందుకు ఉన్న అవకాశాన్ని రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని గత మూడేళ్లుగా రాజగోపాల్ ప్రజల కోసం ఏదైనా ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానంటే కాంగ్రెస్ అడ్డుపడిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసే పోరాటానికి పీసీసీ పదవి అడ్డువచ్చిందా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి.. అందరూ అలాగే అనుకుంటే కాంగ్రెస్ లో ఎవరూ ఉండలేరని అన్నారు. టీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: మునుగోడు ఉపఎన్నికపై సస్పెన్స్.. ముందస్తు ఎన్నికలపై ఉత్కంఠ