MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు..!

by Shiva |
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 29న ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది. నవంబర్ 1న కటాఫ్ (క్వాలిఫైయింగ్) డేట్‌గా పెట్టుకుని ఓటర్ల జాబితాను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఢిల్లీ నుంచి సర్క్యులర్ జారీ అయింది. ప్రస్తుతం శాసనమండలిలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న తాటిపర్తి జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), టీచర్స్ ఎమ్మెల్సీలుగా ఉన్న కూర రఘోత్తమ్‌రెడ్డి, (మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (వరంగల్-ఖమ్మం-నల్లగొండ) పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది. అప్పటికల్లా వీరి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.

Advertisement

Next Story