MLA Vivek: మంత్రి పదవిపై ఎమ్మెల్యే వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
MLA Vivek: మంత్రి పదవిపై ఎమ్మెల్యే వివేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ (Cabinet Expansion)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను రాష్ట్ర అధినాయకత్వం హైకమాండ్‌కు పంపింది. ఈ క్రమంలోనే మంత్రి పదవిపై పెద్దపల్లి (Peddpally) ఎమ్మెల్యే గడ్డం వివేక్ (Gaddam Vivek) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాక కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని అన్నారని తెలిపారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తనకు మాలల అభివృద్ధి, హక్కులు ముఖ్యమని మంత్రి పదవి కాదన్నారు. హైదరాబాద్‌ (Hyderabad) పరేడ్‌ గ్రౌండ్‌ (Parade Grounds)లో జరగనున్న భారీ బహిరంగ సభకు మాలలు అందరూ హాజరుకావాలి.. మాలల ఐక్యతను చాటాలని గడ్డం వివేక్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story