- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Akkineni Akhil: గూస్ బంప్స్ ఖాయం.. ‘లెనిన్’ గ్లింప్స్‌తో అంచనాలను పెంచేసిన మేకర్స్ (ట్వీట్)

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akkineni Akhil) రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరిగా ‘ఏజెంట్’ చిత్రంలో కనిపించిన ఆయన భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం అఖిల్, కిశోర్ అబ్బూరు(Kishore Abburu) కాంబోలో ఓ మూవీ రాబోతుంది. అయితే ‘అఖిల్-6’ వర్కింట్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల(SreeLeela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు అఖిల్ పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ అక్కినేని అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘అఖిల్-6’ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌తో ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘లెనిన్’ టైటిల్ పెట్టినట్లు వెల్లడించారు.
ఇక ఇందులో గుబురు గడ్డంతో కనిపించిన అఖిల్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక గ్లింప్స్ గమనించినట్లైతే.. ‘‘గతాన్ని తరమటానికి పోతా..మా నయాన నాకో మాట జెప్పినాడు. పెట్టేటప్పుడు ఊపిరి ఉంటాది కానీ పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రమే ఉంటది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే అని చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ఊరందరి మధ్యలో అఖిల్‌ను పట్టుకుని శ్రీలీల నవ్వుతూ కనిపిస్తుంది. ఇందులో అఖిల్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు. ఇక వీడియోలో చివరగా.. ‘‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం లేదు’’ అనే కొటేషన్‌ను జత చేశారు. ఈ పోస్ట్‌కు మేకర్స్ ‘‘ప్రతి ఎమోషన్‌ను తుఫానులా కొట్టే అనుభవం. ఈ సారి ఎట్టా ఉంటాదంటే’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులోని అఖిల్ డైలాగ్స్ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి.