Naturist beaches : ఈ బీచ్‌లు వెరీ స్పెషల్.. అలా తిరిగేందకు అనువైనవి కావడంతో..

by Javid Pasha |
Naturist beaches : ఈ బీచ్‌లు వెరీ స్పెషల్.. అలా తిరిగేందకు అనువైనవి కావడంతో..
X

దిశ, ఫీచర్స్ : బీచ్‌ అంటేనే చల్లని గాలులు వీచే అందమైన సముద్ర తీరం.. బీచ్ అంటేనే ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయం.. అందుకే బీచ్‌లలో తిరుగాలని.. అక్కడి వెదర్‌ను ఆస్వాదించాలని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిచోట్ల కొందరికి మాత్రమే ప్రవేశం కలిగిన బ్యూటిఫుల్ బీచ్‌లు సైతం ఉన్నాయని మీకు తెలుసా? అవే న్యూడ్ బీచ్‌లు (Nude beaches). వీటినే నేచురిస్ట్ బీచ్‌లు(naturist beaches) అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ కేవలం నగ్నంగా విహరించే వారికి మాత్రమే అనుమతిస్తారు. అలాగని అవి అశ్లీల కార్యకలాపాలకు నిలయం కాదు. ఆరోగ్యదాయకం అంటున్నారు నిపుణులు. పైగా స్థానిక చట్టాలు, నిబంధనల ద్వారా అవి నియంత్రించబడుతుంటాయి. అందుకే వాటిని చూడ్డానికి, విహరించడానికి కొందరు తెగ క్యూరియాసిటీ ప్రదర్శిస్తుంటారు. అలాంటి నగ్న బీచ్‌లు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి స్పెషాలిటీ ఏమిటో చూద్దాం.

ఫ్లోరిడాలోని హాలోవర్ బీచ్

హాలోవర్ బీచ్ (Hallover).. ఇది ఫ్లోరిడా(Florida)లోని మయామి సమీపంలో ఉంది. అమెరికాలోని మోస్ట్ ఫేమస్ న్యూడ్ బీచ్‌ (Nude beach) లలో ఇదొకటి. 1991 నుంచి ఇది నేచురిస్ట్ బీచ్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇక్కడ 600 మీటర్లకు పైగా ప్రత్యేక ప్రాంతం నగ్నంగా విహరించేందుకు, సన్ బాత్ చేసేందుకు కేటాయించడింది. దీనిని చూసేందుకు ప్రపంచ పర్యాటకులు అత్యంత ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా యూరోపియన్, దక్షిణ అమెరికన్ దేశాల టూరిస్టులు ఈ నగ్న బీచ్‌ను సందర్శించడానికి క్యూరియాసిటీతో ఉంటారని నిపుణులు అంటున్నారు. విషయం ఏంటంటే.. ఇక్కడ ప్రతీ సంవత్సరం నేషనల్ న్యూడ్ క్రియేషన్ వీక్ (National Nude Recreation Week) పేరుతో ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈ సందర్భంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కాబట్టి యువత కూడా ఈ వేడుకలను చూసేందుకు ఆసక్తి చూపుతుంది. అయితే 18 ఏండ్లలోపు వారిని మాత్రం అనుమతించరు.

ఫ్రాన్స్‌లోని కాప్ డి అగ్డే బీచ్

దాని పేరు (Cap d'Agde).. పకలడానికి కాస్త కఠినంగా ఉండొచ్చు కానీ.. చూడ్డానికి మస్తుగా ఉంటుందని ఈ న్యూడ్ బీచ్ గురించి చమత్కరిస్తుంటారు పర్యాటకులు. ఫ్రాన్స్‌లోని లాంగ్యుడాక్ (Languedoc in France) తీరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ‘నేక్డ్ సిటీ’ (Naked City) అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేచురిస్ట్ బీచ్‌లలో ఇది ప్రసిద్ధి చెందింది. ప్రతీ ఏటా వేసవిలో ఇక్కడికి 40 వేలమంది మంది వరకు సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ నగ్నంగా సన్ బాత్ చేయడమే కాకుండా, తీరం వెంబడి నగ్నంగా తిరుగుతూ డైనింగ్, షాపింగ్ చేయవచ్చు. నైట్ లైఫ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ఓపెన్ మైండెడ్ వెదర్ కారణంగా ఇది పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ పెద్దలు, జంటలు నగ్నంగా తిరగడానికి అనుమతి ఇస్తారు. న్యూడ్ బీచ్‌లలో నగ్నత్వం సహజం. కాబట్టి అదేదో పెద్ద అశ్లీలతగా ఎవరూ భావించరు. పైగా ఆరోగ్యానికి మేలు చేసే కార్యకలాపంగా భావిస్తారు. అయినా అక్కడ విహరించే వారికోసం ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది.

వలాల్టా బీచ్, క్రొయేషియా

క్రొయేషియా(Croatia)లోని ఇస్ట్రియన్ ద్వీపకల్పంలో (Istrian Peninsula) ఉన్న అందమైన న్యూడ్ బీచ్ వలాల్టా. ఇది దాదాపు 2 మైళ్ల పొడవైన ఇసుకతో, చల్లటి వాతావరణంతో, ఆలివ్, ద్రాక్ష చెట్లతో చూడముచ్చటగా ఉంటుంది. పర్యాటకులను ఆకర్షించే గొప్ప క్యాంప్ సైట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ షేడ్, పూల్, ఆక్వాబార్, వాటర్ స్లైడ్స్ కూడా ఉంటాయి. ప్రత్యేక ప్యాకేజీలతో ఇక్కడ ఒకటి నుంచి రెండు మూడు రోజుల వరకు గడిపేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. పిల్లలకు, 18 ఏండ్లలోపు వారికి అనుమతి ఉండదు. జంటలు ఒంటరి వ్యక్తులు ఎవరైనా వెళ్లొచ్చు.

గ్రీస్‌లోని రెడ్ బీచ్

గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలో ఉన్న రెడ్ బీచ్ (Red Beach) దాని ఎరుపు రంగు ఇసుక, బ్యూకలర్ వాటర్‌ కారణంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. నేచురిస్ట్ బీచ్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సహజ సిద్ధమైన తీర ప్రాంతం, ప్రకృతి దృశ్యం ఆకట్టుకుంటుంది. అలాగే ఇక్కడి పురాతన గుహలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నగ్నంగా విహరించేందుకు, సన్ బాత్ చేసేందుకు ప్రత్యేక ప్రాంతం కేటాయించబడి ఉంటుంది. అక్కడ జంటలకు, పెద్దలైన ఒంటరి వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

మై ఖావో బీచ్, థాయ్‌లాండ్

థాయ్‌లాండ్‌ అంటేనే పర్యాటక ప్రసిద్ధి చెందిన ప్రాంతమని అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడి ఫుకెట్ (Phuket) ద్వీపంలో గల మై ఖావో బీచ్(Mai Khao Beach) మాత్రం మరింత స్పెషల్. ఎందుకంటే ఇది 7 మైళ్ల పొడవైన నేచురిస్ట్ లేదా న్యూడ్ బీచ్‌గా ఫేమస్ అయింది. అఫీషియల్‌గా న్యూడ్ బీచ్ అని స్థానిక ప్రభుత్వం అనౌన్స్ చేయదు. కానీ నగ్నంగా విహరించే వారికి మాత్రం అనుమతి ఉంది. బీచ్‌కు సమీపంలో రిసార్టులు, బీచ్‌సైడ్ మసాజ్‌లు, బార్‌లు కూడా ఉంటాయి. థాయ్ లాండ్‌లో నేచురిజం (naturism) పెరుగుతున్నందున ఈ బీచ్‌కు ఇటీవల మరింత ఆదరణ పెరిగిందంటున్నారు పర్యాటక నిపుణులు.



Next Story

Most Viewed