హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర

by Rajesh |
హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో వివిధ వ్యాపారాలు చేస్తూ నివాసం ఉంటున్న రాజస్థానీ, బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మార్వాడీలు లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. మార్వాడిలతో కలిసి ఆటపాట ఆడి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య వారికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ‌న సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను పండుగ‌లు చాటి చెబుతాయ‌ని ఎమ్మెల్యే అన్నారు. భార‌త‌దేశంలో మ‌నం జ‌రుపుకునే పండుగ‌లు ఎంతో గొప్ప‌వని, ప్ర‌తి పండుగ‌కు ఒక ప్ర‌త్యేక విశిష్ట‌త ఉంద‌న్నారు.

హోలీ వేడుకలను ప్రతి సంవత్సరం దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నార‌ని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంద‌ని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్క్ రఫీ, మల్లూరు అంకం రాజు, వార్డ్ కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్ బాషా, తడికమళ్ళ ప్రకాశరావు పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story