మునావర్‌కు పర్మిషన్.. MLA రాజాసింగ్ సెన్సేషనల్ వార్నింగ్

by Nagaya |
మునావర్‌కు పర్మిషన్.. MLA రాజాసింగ్ సెన్సేషనల్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్ షో విషయంలో హై టెన్షన్ నెలకొంది. షో ను అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరించినా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునావర్ ఫారుఖీ షో ను అడ్డుకుని తీరుతామని అన్నారు. ఈ విషయంలో తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినా బాధపడనని కామెంట్స్ చేశారు. తన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే నుపూర్ శర్మ మాదిరి నన్ను కూడా సస్పెండ్ చేయవచ్చు కానీ నేను మాత్రం వెనుకడుగు వేయబోయేది లేదన్నారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మోడీ, అమిత్ షా లకు ఫాలోవర్‌గా ఉంటాను తప్పా మునావర్ షో జరగనివ్వబోమని అన్నారు. పార్టీ కంటే తనకు ధర్మాన్ని కాపాడటమే ముఖ్యమని, హిందువులకు క్షమాపణలు చెప్పాకే మునావర్ ఫారుకీ షో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అలా కాకుండా మొండిగా షో నిర్వహించాలని ప్రయత్నిస్తే షో లోపలే మునావర్ ఫారుఖీని కొట్టి పంపిస్తామన్నారు. ఇప్పటికే షో ఎంట్రీ టికెట్లు తమ వారి వాద్ద ఉన్నాయని.. క్షమాపణలు చెప్పకుండా షో నిర్వహిస్తే అక్కడే ఫారూఖీపై దాడి చేస్తామని హెచ్చరించారు. సీతా రాముడిని కించపరిచిన మునావర్ ఫారూఖీకి కేటీఆర్ అండగా నిలవటం శోచనీయం మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు హిందూ సమాజానికి పట్టిన చీడ పురుగులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో అమిత్ షా సభకు తాను హాజరుకావడం పోలీసుల మీద ఆధారపడి ఉందని అన్నారు. కాగా, రాజాసింగ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇంటి నుంచి రాజాసింగ్ బయటకు వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రేపు శిల్పకళా వేదికలో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో షోను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించిన నేపథ్యంలో ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed