బ్రేకింగ్: BRS ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం

by Satheesh |   ( Updated:2023-03-13 11:48:08.0  )
బ్రేకింగ్: BRS ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. సోమవారం ఉప్పుగల్ వద్ద నిర్వహిస్తోన్న బోనాల పండుగకు ఎమ్మెల్యే రాజయ్య అతిథిగా వెళ్లారు. అయితే, బోనాల వద్ద ఏర్పాటు దివిటీల పొగతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున తేనేటీగలు లేచాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న రాజయ్య వెంటనే అప్రమత్తమై తేనేటీగల దాడి నుండి తప్పించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే రాజయ్య అక్కడి నుండి వాహనంలో వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story