Munawar Faruqui: అతడు రాష్ట్రానికి వస్తే నిప్పు పెట్టి తగలేస్తా.. రాజాసింగ్ హెచ్చరిక

by Nagaya |   ( Updated:2022-08-11 07:13:48.0  )
MLA Raja Singh Warns Minister KTR Over Munawar Faruqui Show in Hyderabad
X

దిశ, వెబ్‌డెస్క్ : MLA Raja Singh Warns Minister KTR Over Munawar Faruqui Show in Hyderabad| హైదరాబాద్‌లో మునావర్ పర్యటనపై మరోసారి వివాదం చెలరేగింది. మునావర్ ఫరుఖీ కార్యక్రమాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మునావర్ రాష్ట్రానికి వస్తే అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ స్థలాన్ని తగులబెడతామని రాజాసింగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. మంత్రి కేటీఆర్‌ను ఘాటు వ్యాఖ్యలతో హెచ్చరించిన రాజాసింగ్.. మునావర్‌ను పిలవొద్దని కేటీఆర్‌కు సూచించారు. ఒక వేళ మునావర్ రాష్ట్రానికి వస్తే కొట్టి పంపిస్తామన్నారు. కామెడీ షోల పేరుతో హిందూ దేవుళ్లను అవమానించే మునవార్ ఫారుఖీ రాష్ట్రానికి వస్తే తెలంగాణలో ఉన్న హిందువులు ఊరుకోరని హెచ్చరించారు. అతడి పర్యటనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఫారుఖీ షోకు ఎవరైనా సహకరిస్తే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

గతంలో సీతాదేవిపై ఫారుఖీ జోకులు వేయడం వివాదాస్పదమైంది. అతడిని కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ విధించింది. నిజానికి ఈ షో జనవరిలోనే జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అప్పట్లోనూ రాజాసింగ్ ఫారుఖీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాండప్ కమెడియన్ మునవార్ ఫారూఖీపై కంగనా రనౌత్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న 'లాకప్' షో ద్వారా మంచి పాపులరిటీ సంపాదించాడు. తనదైన కామిక్ టైమింగ్, కవిత్వాలతో ఆకట్టుకునే ఫారుఖీ ఈ నెల 20వ తేదీన 'డోంగ్రీ టు నోవేర్' పేరుతో హైదరాబాద్‌లో షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఫారుఖీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడుతున్నారు. అతను షో నిర్వహిస్తే ఆ ప్రదేశాన్ని తగలబెట్టేస్తామని హెచ్చరించడంతో ఈ షో పై దుమారం చెలరేగింది.

ఇది కూడా చదవండి: మునుగోడులో హస్తం టికెట్ అతడికే..!

Advertisement

Next Story