ఎన్నికల ముందు KCR సర్కార్ తమాషాలు: ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

by Satheesh |   ( Updated:2023-09-02 09:29:05.0  )
ఎన్నికల ముందు KCR సర్కార్ తమాషాలు: ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో ఇళ్లు నిర్మించి.. తాము నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతోందని విమర్శించారు. ఆ విషయము చెప్పేందుకు కేసీఆర్ మీకు సిగ్గు ఎందుకు అని ప్రశ్నించారు. మీ జేబులో నుంచి ఇస్తున్నారా మీ పార్టీ ఫండ్ నుంచి ఇస్తున్నారా అని నిలదీశారు.

డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించటంలో ప్రభుత్వం విఫలమైందని ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులు కానీ వారికి డబుల్ ఇల్లు ఇస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఐదు వందల మందికి డబుల్ బెడ్ రూమ్ కేటాయిస్తే అందులో 280 మంది వరకు ఇళ్లు ఉన్నవారే అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళకే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నారన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ తమాషాలు చేస్తోందని, ఇప్పటివరకు ఎన్ని కట్టారని రాజాసింగ్ ప్రశ్నించారు.

ఒకే వేదికపై హరీష్ రావు, రాజాసింగ్..

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఇవాళ మంత్రి హరీష్ రావు సమక్షంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమం వేదికను తను బహిష్కరించానని తెలిపారు. ఏ వేదికపై ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మోడీని, బీజేపీను టార్గెట్ చేస్తున్నారని, అందుకే తను వేదిక పై నుంచి వచ్చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed