ప్రజల బాధలు, గోస పట్టని రాష్ట్ర ముఖ్యమంత్రి: Raghunandan Rao

by GSrikanth |   ( Updated:2023-08-01 13:17:25.0  )
ప్రజల బాధలు, గోస పట్టని రాష్ట్ర ముఖ్యమంత్రి: Raghunandan Rao
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరద ప్రభావంపై సీఎం కేసీఆర్ కేవలం అధికారలతో సమీక్షలకే పరిమితమయ్యారు. దీంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దిశ’ పేపర్‌లో వచ్చిన ‘కేసీఆర్‌కు వరద చిక్కులు’ అనే ఆర్టికల్‌పై సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందిచారు. ‘కేసీఆర్‌కు వరద చిక్కులు? వరద ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూలకు దూరం ? రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో అల్లాడుతున్న ప్రజలు!! ప్రజల్ని, సమస్యల్ని, వరద బాధితులను వదిలి, మహారాష్ట్ర వైపు పయనిస్తున్న సారు! ప్రజల బాధలు, గోస పట్టని రాష్ట్ర ముఖ్యమంత్రి’ అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు

Twitter Link of Raghunandan Rao Madhavaneni

Advertisement

Next Story

Most Viewed