MLA క్రాంతికి ఝలక్‌.. సొంత మండలంలో బిగ్ షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-18 06:22:38.0  )
MLA క్రాంతికి ఝలక్‌.. సొంత మండలంలో బిగ్ షాక్!
X

దిశ, అందోల్‌: అందోల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా షాక్‌‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు వీడుతుండడంతో గడ్డుకాలం కనిపిస్తోంది. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సొంత మండలమైన వట్‌పల్లి జెడ్పీటీసీ బీఆర్‌ఎస్‌ కు వీడ్కోలు పలకడం మండల వ్యాప్తంగా పార్టీకి గట్టి దెబ్బేనని చెప్పవచ్చు. కొంత కాలంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ వ్యవహరశైలి, ఆయన సోదరుల రాజకీయ జోక్యంతో పాటు ఆమెకు పార్టీలో సరైన గౌరవం, గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.

ఈ విషయం పార్టీలోని నాయకులకు తెలిసినా, ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీని వీడినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. ఈ విషయాన్ని ‘దిశ’ దినపత్రిక ముందుగానే ప్రచురించింది. శుక్రవారం ఆమె మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడుతుండడం అందోలు బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీలో చేరే వారి కంటే వీడుతున్న వారే అధికంగా ఉండడంతో ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వట్‌పల్లి జడ్పీటీసీ సభ్యురాలు పత్రి అపర్ణ శ్రీకాంత్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

గత కొంతకాలంగా ఆమె ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ వ్యవహరశైలి, అతని సోదరుల రాజకీయ జోక్యంతో విసుగు చెందిన ఆమె తన వర్గీయులతో కలిసి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్‌ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వట్‌పల్లిలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సభలో దామోదర వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వట్‌పల్లి మండలం దుద్ద్యాల గ్రామానికి చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు, రేగోడు మాజీ ఎంపీపీ పత్రి విఠల్‌ కుటుంబానికి చెందిన పత్రి అపర్ణ ఎంటెక్‌ చదివి, రాజకీయ రంగంపై ఆసక్తితో 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున వట్‌పల్లి జెడ్పీటీసీగా పోటీ చేసి, 1300 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

వట్‌పల్లి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం.. : దామోదర

జడ్పీటీసీ పత్రి అపర్ణ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి రావడం శుభపరిణామని దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వట్‌పల్లి మండలాన్ని మరింతగా అభివృద్ది చేసుకుందామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లేకపోవడం, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఆయన సోదరుల వ్యవహారం నచ్చకనే పార్టీ వీడుతున్నట్లు ఆమె తెలిపారు. దామోదర రాజనర్సింహ వట్‌పల్లి మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఈసారి ఎన్నికల్లో దామోదరను భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యతను మనందరం తీసుకోవాలని, మన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.

దామోదరతోనే అభివృద్ధి సాధ్యం: జెడ్పీటీసీ అపర్ణ

కొంత కాలంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లేకపోవడం, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఆయన సోదరుల వ్యవహరం నచ్చకనే పార్టీ వీడుతున్నట్లు ఆమె తెలిపారు. దామోదర రాజనర్సింహ వట్‌పల్లి మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఈసారి ఎన్నికల్లో దామోదరను భారీ మేజార్టీటితో గెలిపించుకునే బాధ్యతను మనందరం తీసుకోవాలని, మన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​‌లోకి భారీగా చేరికలు

వట్‌పల్లిలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సభలో బీఆర్‌ఎస్‌‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వట్‌పల్లి జెడ్పీటీసీ పత్రి అపర్ణ శ్రీకాంత్, ఆమె వర్గీయులు, పుల్కల్‌ మండలం ఎస్‌.ఇటిక్యాలకు చెందిన సీనియర్‌ నాయకుడు సురేందర్‌గౌడ్, సుధాకర్, ముదిరాజ్‌ సంఘం సభ్యులు, జోగిపేటకు చెందిన మాజీ వార్డు మెంబర్‌ శివకుమార్, వర్తక సంఘం సభ్యుడు భిక్షపతితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Next Story

Most Viewed