- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వాటాలివ్వాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరింపులు : రేవంత్ రెడ్డి
దిశ, నందిపేట్ : హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ లక్కం పల్లి సెజ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. 421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో పసుపు, మొక్కజొన్న, సొయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016 బీజేపీ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా ముందుకు తీసుకెళతామని ప్రభుత్వం మాట ఇచ్చిందని పేర్కొన్నారు.
ఓ తెలంగాణ పారిశ్రామిక వేత్త దీన్ని నడిపేందుకు ముందుకు వచ్చినా సీఎం అందుబాటులోకి రాలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరించారన్నారు. టీఎస్ఐఐసీ నుంచి ఇక్కడ ఒక సూపర్ వైజర్‌ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవన్నారు. జోనల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు. నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదన్నారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదన్నారు. అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు 30శాతం కప్పం కట్టాల్సిందే అని హుకుం జారీ చేశారని ఆరోపించారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. గతంలో పతంజలి కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కవిత పెద్ద ఎత్తున ప్రచారం చేశారన్నారు. కానీ ఇప్పటికీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదన్నారు. రాందేవ్ బాబాతో మాట్లాడి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఇక్కడి ఎంపీ కృషి చేయాలన్నారు. తక్షణమే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై కేసీఆర్ రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని కోరారు.