రోజుకు రూ.60 లక్షల ఖర్చు.. ప్రధాని బట్టలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2022-09-12 06:00:31.0  )
రోజుకు రూ.60 లక్షల ఖర్చు.. ప్రధాని బట్టలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ టీ-షర్ట్‌పై బీజేపీ చేస్తోన్న విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. రాహుల్ గాంధీ టీ-షర్ట్స్‌పై బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను, రాహుల్‌ను ఏం విమర్శించలేక బట్టలమీద పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు రూ.20 లక్షల విలువచేసే బట్టలను ప్రధాని మోడీ వేసుకున్నప్పుడు ఈ బీజేపీ నేతలు ఎక్కడ పోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ రోజు మూడు డ్రెస్సులు మార్చి రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును ఇష్టారీతిన మోడీ ఖర్చు పెడుతూ సోకులు పడుతున్నాడని జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు.

ఇవి కూడా చ‌ద‌వండి : 'కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ వెయిట్ చేస్తోంది'

ఇవి కూడా చ‌ద‌వండి : తమ్మినేని నవీన్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్..

Advertisement

Next Story

Most Viewed