లక్ష కోట్లు గంగపాలవడం బాధేస్తోంది.. KCR రాజీనామా చేయాలి: ఈటల డిమాండ్

by Satheesh |   ( Updated:2023-10-23 08:44:25.0  )
లక్ష కోట్లు గంగపాలవడం బాధేస్తోంది.. KCR రాజీనామా చేయాలి: ఈటల డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీకులు అవుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల ఇప్పుడు రూ. వేల కోట్ల ప్రజా ధనం వృథా అయ్యిందని మండిపడ్డారు. మేడిగడ్డ వంతెన కుంగడంతో పరిసరాల ప్రజలు తీవ్ర భయాందోళనలలో ఉన్నారని, బ్యారేజీని వెంటనే పునరుద్ధరించకపోతే ఏళ్లు తరబడి నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. బ్యారేజీ వద్దకు రాకుండా పరిసరాల్లో 144 సెక్షన్ విధించారని ఫైర్ అయ్యారు.

వేల కోట్లు పెట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ద్వారా ఐదేళ్లలో కేవలం ఎత్తిపోసింది 172 టీఎంసీలే, కానీ ఎత్తిపోసేందుకు అయిన విద్యుత్ బిల్లు రూ.9 వేల కోట్లు అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు పెట్టిన రూ. లక్ష కోట్లు గంగపాలవడం బాధిస్తోందన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై నిపుణుల కమిటీ వేసి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed