కేసీఆర్‌కు డబ్బుల సంచులు, లిక్కర్‌పైనే నమ్మకం: MLA ఈటల రాజేందర్ ఫైర్

by Satheesh |   ( Updated:2023-08-20 14:37:29.0  )
కేసీఆర్‌కు డబ్బుల సంచులు, లిక్కర్‌పైనే నమ్మకం: MLA ఈటల రాజేందర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం కూకట్ పల్లిలో బీజేపీ బహిరంగా సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణలోని విలువైన భూములను కబ్జాదారుల పాలుజేశారని అన్నారు. రూ. 5 వేల కోట్ల విలువైన ఎళ్లమ్మబండ భూములు కబ్జాలకు గురైందన్నారు.

భూమి కబ్జాకు గురైతే.. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కబ్జాదారులతో కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రగతి నగర్‌లో శ్మశాన వాటికను కూలగొట్టి కబ్జాదారులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఎళ్లమ్మబండ సర్వే నెంబర్ 57 భూములపై రేపు ధర్నా చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల మీద నమ్మకం లేదని.. కబ్జాదారులు, డబ్బుల సంచులు, లిక్కర్‌పైనే కేసీఆర్‌కు నమ్మకం అని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story