బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కూల్చడం ఖాయం: Etela Rajender

by Satheesh |   ( Updated:2023-11-01 14:45:08.0  )
బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కూల్చడం ఖాయం: Etela Rajender
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సమయంలో ఒకరిద్దరు నేతలు పార్టీలు మారుతూ ఉండొచ్చని, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావొద్దని ఫిక్స్ అయ్యారని ఈటల రాజేందర్ అన్నారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు బతికి బట్ట కట్టరనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందన్నారు. బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కూల్చడం ఖాయమని స్పష్టంచేశారు. కాంగ్రెస్ గత చరిత్ర తెలంగాణ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తోందని చురకలంటించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కి పలుకుబడి, విశ్వాసం లేదని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటేసినా, బీఆర్ఎస్‌కి ఓటు వేసినా ఒకటే అని ప్రజలు గ్రహించారని, అందుకే ప్రజలు బీజేపీని గెలిపించాలని భావిస్తున్నారన్నారు.

Advertisement

Next Story