సుప్రీం కోర్టు నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-02-04 07:21:40.0  )
సుప్రీం కోర్టు నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపుల అంశంలో కోర్టు నోటీసుల (Court Notices)పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagendar) స్పందించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) నేపధ్యంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని చెప్పారు. అలాగే అధికారులపై మీడియా ముఖంగా దానం ఫైర్ అయ్యారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అన్నారు. అంతేగాక తాను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదని, ఇప్పటికీ కాంప్రమైజ్ కాలేదు.. కాను కూడా.. అని తెలిపారు.

అంతేగాక వైఎస్ఆర్ పాలనలో సైతం అధికారుల విషయంలో తాను వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లు కూలుస్తానంటే ఊరుకునేది లేదని, హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇక నా ఇంట్లో వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని, ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. వాళ్లు తన అభిమానులని, ఎవరి అభిమానం వాళ్లకి ఉంటుందని దానం వ్యాఖ్యానించారు. కాగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు (Notices) జారీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి (Telangana Assembly Secretary)ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు దానం నాగేందర్ (Danam Nagendar), తెల్లం వెంకట్రావు (Thellam VenkatRao), కడియం శ్రీహరి (Kadiyam Srihari), పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam srinivas Reddy), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishana Mohan Reddy), కాలే యాదయ్య (Kale Yadaiah), టి.ప్రకాశ్ గౌడ్ (T Prakash Goud), అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi), గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy), ఎం.సంజయ్ కుమార్ (M.Sanjay Kumar) లకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు.

Next Story