- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీధి కుక్కల అంశం పై నోరు జారిన దానం
by Javid Pasha |
X
దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: వీధి కుక్కల దాడులపై హైదరాబాద్ మేయర్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం సద్దుమనగక ముందే దానం నాగేందర్ నోరు జారారు. నాగాలాండ్ నుంచి మనుషుల్ని పిలిస్తే వీధి కుక్కల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గతంలో ఎన్నికల ఇంచార్జ్ గా తాను ఆదిలాబాద్ వెళ్లినట్టు చెప్పారు. ఆ సమయంలో అక్కడ కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉండేదన్నారు. అయితే, నాగాలాండ్ నుంచి కొంతమంది వచ్చారని, ఆ తర్వాత నెల రోజులకే కుక్కలు, కోతులు కనిపించకుండా పోయాయన్నారు.
దాంతో అక్కడి వారిని ప్రశ్నించగా నాగాలాండ్ నుంచి వచ్చిన వాళ్లు కుక్కలు, కోతులను కోసుకుని తింటున్నారని చెప్పినట్టు తెలిపారు. హైదరాబాద్ కు కూడా వాళ్లను పిలిపిస్తే కుక్కల సమస్య పోతుందంటూ వ్యాఖ్యనించారు. దీనిపై మరోసారి కలకలం రేగుతోంది. బాధ్యత గల నాయకులు ఇలానేనా మాట్లాడటం అని జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు
Advertisement
Next Story