'మల్లన్నగుట్ట అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తా'

by GSrikanth |   ( Updated:2022-03-04 10:16:37.0  )
మల్లన్నగుట్ట అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తా
X

దిశ, రామన్నపేట: మల్లన్న గుట్ట అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం రాత్రి రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలోని మల్లన్నగుట్టపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహకారం కూడా అందివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సర్పంచ్ గుత్తా నర్సిరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ కొండ శ్రీనివాస్, ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య, సర్పంచులు ఎడ్ల మహేందర్ రెడ్డి, మెట్టు మహేందర్ రెడ్డి, ముత్యాల సుజాత రవి, కాట్రపల్లి సిద్ధమ్మ యాదయ్య, ఉప్పు ప్రకాష్, కొండ బుచ్చిబాబు, కంభంపాటి శ్రీనివాస్, ఆవుల నరేందర్, కొండ అశోక్, కొండ మల్లేశం, దయ్యాల భిక్షమయ్య, బద్దుల రవి, బత్తుల వెంకటేశం, మందడి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story